అథ్లెట్ దీప్తికి భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెట్

Update: 2024-09-07 15:19 GMT

దిశ, పర్వతగిరి: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెట్ దీప్తి జీవాంజి పారిస్ పారాలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుంది.ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో వారిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం దీప్తిని అభినందిస్తూ భారీ నజరానా ప్రకటించారు. ఆమెకు రూ. కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్ లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీప్తి కోచ్ కు రూ.10 లక్షలు నజరానా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఈ సందర్భంగా కల్లెడ గ్రామస్థులను దీప్తి తల్లిదండ్రులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సీఎం ను కల్పించారు. పార్టీ బలోపేతం లో వారి కృషి గురించి చెప్పగా సీఎం అభినందించారు.

మరో వైపు పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి, కోచ్ నాగపురి రమేష్, అథ్లెటిక్ మృదుల, వర్ధన్నపేట కాంగ్రెస్ అధికార ప్రతినిధి శేఖర్ రావు, కల్లెడ గ్రామ పార్టీ అధ్యక్షులు ముదురకోల రమేష్, వడ్లకొండ రమేష్, మేడగాని యాకయ్య, ముదురకొల నాగరాజు, ఏన్నమనేని వెంకటేశ్వర్లు, ముదురకోల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Similar News