జంగా కూతురు వివాహానికి హాజరైన సీఎం..
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి కుమార్తె డాక్టర్ నిఖితా రెడ్డి - డాక్టర్ అవినాష్ రెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
దిశ, వరంగల్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి కుమార్తె డాక్టర్ నిఖితా రెడ్డి - డాక్టర్ అవినాష్ రెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో ఆదివారం డాక్టర్ నిఖితా రెడ్డి - డాక్టర్ అవినాష్ రెడ్డిలకు ఆదివారం వివాహం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10:30గంటలకు హన్మకొండకు చేరుకుని ఫంక్షన్ హాల్‌కు చేరుకుని నూతన దంపతులను ఆశీర్వదించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మడికొండకు చేరుకున్నారు. మడికొండలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.