భోజనం సరిగా పెడతలేరు.. పాఠశాల ఎదుట విద్యార్థుల ధర్నా..

పాఠశాలలో భోజనం సరిగా పెట్టడం లేదని గురువారం విద్యార్థులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

Update: 2023-03-23 09:38 GMT

దిశ, వేలేరు(ధర్మసాగర్): పాఠశాలలో భోజనం సరిగా పెట్టడం లేదని గురువారం విద్యార్థులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల, కళాశాలలో భోజనం మంచిగా లేదని, నీళ్లతో కూడిన కూరలు, ఉడికిఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... భోజనం మెనూ ఫాలో కాకుండా కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, సాంబార్ పేరుతో చింతపండు పులుసుతో వేడి నీళ్లు పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నం ముద్దగా ఉంటుందని జీరా రైస్ లో నీళ్లు ఉంటాయని వాపోయారు. అన్నం తినలేక పస్తులతో పడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం లేక ట్యాంక్ వాటర్ తాగుతున్నామని, ఇంకా పాఠశాలలో ఏ స్విచ్ బోర్డు పలిగిన మాకు వచ్చే కాస్మోటిక్ బిల్లులలోనే కట్ చేస్తున్నారని చెప్పారు. బాత్ రూం పైపుల లీకేజీ వల్ల వచ్చే వాసన భరించలేక పోతున్నామని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. 

Tags:    

Similar News