అక్రమంగా కలప తరలిస్తున్న ఎడ్ల బండ్లు స్వాధీనం
ములుగు జిల్లా లో అక్రమంగా కలప తరలిస్తున్న ఐదు ఎడ్లబండ్లను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా లో అక్రమంగా కలప తరలిస్తున్న ఐదు ఎడ్లబండ్లను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బండ్లపహాడ్ గ్రామ సరిహద్దు ప్రాంత అడవి నుంచి అక్రమంగా కలప తరలిస్తున్నారన్న సమాచారంతో ములుగు ఎఫ్ ఆర్ ఓ డోలి శంకర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా బిల్లులు కలపను తరలిస్తున్న ఐదు ఎడ్లబండ్లతో పాటు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎద్దుల బండ్లతో పాటు కలపను ములుగు ఫారెస్ట్ ఆఫీస్ కి తరలించగా స్వాధీనం చేసుకున్న కలప విలువ రెండు లక్షలు వరకు ఉంటుందనీ,అక్రమంగా చెట్లను నరికిన,కలప తరలించిన,వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ములుగు ఎఫ్ఆర్వో డోలి శంకర్ తెలిపారు.