బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది : డాలి శర్మ

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం

Update: 2023-10-30 14:47 GMT

దిశ,హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఏఐసీసీ & ఉత్తర తెలంగాణా అధికార ప్రతినిధి డాలి శర్మ అన్నారు.హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటంతో కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబ పాలన కోన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పధకాలను కచ్చితంగా అమలు చేస్తుందని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని జాబ్ క్యాలెండర్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు.అధికారంలోకి రాగానే 2 లక్ష ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు.బీఆర్ఎస్ ,బీజేపీ పార్టీలు కలిసి లోపాయి కారి ఒప్పనాధంతో పనిచేస్తున్నామని అందుకే కేసీఆర్ కూతురు కవితను లిక్కర్ కేసులో ఆరోపణలు ఉన్న అరెస్ట్ చేయకుండా డ్రామాలు ఆదుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో మహిళలపై వేధింపులలో మొదటి స్థానంలో ఉందని మండిపడ్డారు. మహిళా సాధికారత ఎక్కడని ప్రశ్నించారు.

Tags:    

Similar News