ఆత్మకూరు సొసైటీ చైర్మన్ సస్పెండ్..

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం వ్యవసాయ సహకార సంఘం

Update: 2024-09-14 12:19 GMT

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. కాగా చైర్మన్ ఎరుకొండ రవీందర్ సస్పెండ్ చేస్తూ డీసీవో నీరజ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఇటీవల సొసైటీ డైరెక్టర్లు నత్తి సుధాకర్, రేవూరి జైపాల్ రెడ్డి, తో పాటు పలువురు డైరెక్టర్లు రైతుల నుండి సొసైటీ చైర్మన్ ఎరుకొండ రవీంద్ర డబ్బులు వసూలు చేశారని, వివరాలతో డీసీఒకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి అక్రమాలు నిరూపణ కావడంతో చైర్మన్ ఏడుకొండ రవీందర్ ను సస్పెండ్ చేస్తూ డీసీవో ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలలు పదవి కాలం ముందు చైర్మన్ సస్పెండ్ కావడంతో వైస్ చైర్మన్ జనగాం ప్రభాకర్ గౌడ్ ను ఇన్చార్జ్ చైర్మన్ గా నియమిస్తూ జిల్లా కో ఆపరేటివ్ సహకార సంఘం అధికారి నీరజ ఉత్తర్వులను జారీ చేశారు.


Similar News