MLAs : నిరుపేదల కోసమే ఆత్మబంధు
నిరుపేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆత్మబంధు ఫౌండేషన్‌ను గాజర్ల అశోక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు.
దిశ, వరంగల్ బ్యూరో : నిరుపేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆత్మబంధు ఫౌండేషన్‌ను గాజర్ల అశోక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గాజర్ల అశోక్ బంధు, మిత్రులతో కలిసి ఆత్మబంధు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు నాయిని, గండ్ర సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గాజర్ల అశోక్ పేదల పక్షపాతి అని కొనియాడారు. సమాజంలో పేదలను ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్‌కు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫౌండేషన్ నిర్వాహాకులు గాజర్ల అశోక్ మాట్లాడుతూ… నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు పేద ప్రజలకు వైద్యం,నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ ఇప్పించే బాధ్యతలను తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు రవీందర్ , విజయ్ , నవీన్, విశ్వనాధ్ , రోహిత్, రమేష్, శ్రీనివాస్ , చందర్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.