జూనియర్ కార్యదర్శుల స్థానంలో ఇంచార్జ్ లు..
ఉద్యోగాలను రెగ్యుల రైజ్ చేయాలని, నాలుగేళ్ల ప్రొబెషనరీ పీరియడ్‌ను సర్వీస్ కాలంగా పరిగణించాలనే డిమాండ్లతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్), ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) ఈ నెల 28 న నిరవధిక సమ్మె ప్రారంభించారు.
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : ఉద్యోగాలను రెగ్యుల రైజ్ చేయాలని, నాలుగేళ్ల ప్రొబెషనరీ పీరియడ్‌ను సర్వీస్ కాలంగా పరిగణించాలనే డిమాండ్లతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్), ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) ఈ నెల 28 న నిరవధిక సమ్మె ప్రారంభించారు. దీనితో ఆయా మండల పరిషత్ కార్యాలయంలో నిరసన దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలు శనివారం నాటికి రెండవ రోజుకు చేరాయి. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శిలు, ఓపీఎస్ లు పని చేస్తున్న గ్రామాల్లో జిల్లా పంచాయతీ శాఖ పరిధిలో పని చేస్తున్న వివిధ హోదాల ఉద్యోగులను ఇంచార్జీ కార్యదర్శిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కక్క ఉద్యోగికి మూడు, నాలుగు గ్రామ పంచాయతీలు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా లో461 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 370 మంది జేపీఎస్ లే. మిగిలిన వాటిలో రెగ్యులర్ కార్యదర్శులు విధులు నిర్వహించే వారు. సమ్మె కారణంగా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాలలో వివిధ హోదాలో పనిచేసే సుమారు 155 మంది ఉద్యోగస్తులకు గ్రామ పంచాయితీ లను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 15 మంది సూపరిడెంట్ లను, 12 మంది టైపిస్టులను, 14 మంది సీనియర్ అసిస్టెంట్లను, 23 మంది జూనియర్ అసిస్టెంట్ లను, 7 గురిని జేబీఎస్, బిల్ కలెక్టర్ లను, 84 మంది రెగ్యులరైజ్ కార్యదర్శులు నేటి నుండి ఇంచార్జ్ కార్యదర్శులుగా విధులు చేపట్టనున్నారు.