డిజిటల్ బార్ కోడ్ ద్వారా పన్నులు చెల్లించండి..

డిజిటల్ బార్ కోడ్ ద్వారా పన్నులు చెల్లించే సదావకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరారు.

Update: 2023-06-18 13:02 GMT

దిశ, వరంగల్ టౌన్ : డిజిటల్ బార్ కోడ్ ద్వారా పన్నులు చెల్లించే సదావకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేసి ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లించే సౌకర్యాన్ని మహా నగరపాలక సంస్థ తీసుకువచ్చారన్నారు. ఇందుకు సంబంధించి నగర వాసులకు డిజిటల్ డిమాండ్ నోటీసులను అందజేశారని తెలిపారు.

వీటి పైన ఇంటి, నల్లా పన్నుల చెల్లింపు సంబంధ బార్ కోడ్ లు ముద్రించి ఉంటాయన్నారు. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఇంటి వద్ద నుండే బిల్లులు చెల్లించవచ్చునని, నగర పరిధిలోని ఇంటి యాజమాన్యాలు ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని సులువుగా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ కోరారు.

Tags:    

Similar News