Alair MLA : సంక్షేమ కార్యక్రమాల అమలులో మన రాష్ట్రం దేశానికే ఆదర్శం

సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా

Update: 2024-09-17 11:40 GMT

దిశ,జనగామ:సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని, ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు.ఆ తర్వాత తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు సమర్పించిన తదనంతరం ముఖ్య అతిథి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాట్లాడుతూ..నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టి, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అంచెలంచెలుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ, విజయవంతంగా ఆరు గ్యారెంటీల పథకాలు ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు.అనంతరం మైత్రేయ కళా క్షేత్రం, జనగామ చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి, అలాగే ధర్మకంచ జడ్పీహెచ్ఎస్, జనగామ జడ్పీహెచ్ఎస్ (బాలికలు), పెంబర్తి ఎంజెపీటీ (బాలికలు) దేశభక్తి గేయాల నృత్యాలు వీక్షకులను అలరించాయి.

తరిగొప్పుల మండలం కు చెందిన జాటోతు వీరయ్య విద్యుత్ షాక్ తో మరణించగా, అతని కుటుంబానికి రూ. రెండు లక్షల చెక్ ను అందించడమే కాక ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. నాలుగు లక్షల చెక్ ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.అనంతరం జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిసాయి .ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News