ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు.. అందరూ చేయించుకోండి..
దిశ, ములుగు ప్రతినిధి: ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అదనపు క
దిశ, ములుగు ప్రతినిధి: ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఏటూర్ నాగారంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 35 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, క్యాన్సర్ లక్షణాలు ఉన్న సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
పొగాకు, గుట్కా, పొగ తాగే వ్యక్తులు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, గతంలో జీవనశైలి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. అత్యాధునిక యంత్రాలతో పాటు ప్రతిమ ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది ఉంటారని, ఇది పూర్తిగా ఉచితం అని చెప్పారు. ముందస్తు రిజిస్ట్రేషన్ ఏమి లేదని, నేరుగా వైద్య కేంద్రానికి రావచ్చని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డిపిఓ వెంకయ్య, వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రతిమ హాస్పిటల్ వైద్య సిబ్బంది, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.