ఆయిల్ ఫామ్ తోటల సాగుకు పక్కా ప్రణాళిక... కలెక్టర్ శశాంక

ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ప్రణాళిక అవసరమని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

Update: 2023-05-06 16:32 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్ : ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ప్రణాళిక అవసరమని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం ఐడీఓసీ లోని కలెక్టర్ సమావేశమందిరంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళిక అవసరం అన్నారు. అలాగే గోపాలపురంలో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 4.37 లక్షల ఎకరాలలో వ్యవసాయ సేద్యంకొరకు 1.78 లక్షల కెమికల్స్ వినియోగిస్తున్నట్లు అంచనా ఉందని, తగ్గించేందుకు అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లాలో రైతులకు సరఫరా చేసే యూరియా, ఫెస్టిలైజర్స్ జిల్లాలోని కేసముద్రం, డోర్నకల్ లలో సరఫరా కొరకు ప్రజాప్రతినిధుల నుండి ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించేందుకు కృషిచేయాలన్నారు. జిల్లాలో ఆగ్రోస్ నుండి 38 షాప్ లు ఉన్నాయని, ప్రతిమండలంలో 2, లేక 3 షాప్ లు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మిర్చి పంట పెంచేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. రైతులు మిర్చిలో కొత్త వంగడాలు చేపట్టే విధంగా సాంకేతికంగా శాస్త్రవేత్తలతో కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ అధికారి చత్రునాయక్, ఉద్యాన అధికారి సూర్యనారాయణ, ఏడి.లక్ష్మీనారాయణ, శోభన్ బాబు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News