సంచలనాలకు మారుపేరు "దిశ"

దిశ దినపత్రిక నిజాన్ని నిర్భయంగా రాస్తుందని పురపాలక కమిషనర్ నాయిని వెంకటస్వామి కొనియాడారు.

Update: 2024-12-30 10:57 GMT

దిశ,డోర్నకల్ : దిశ దినపత్రిక నిజాన్ని నిర్భయంగా రాస్తుందని పురపాలక కమిషనర్ నాయిని వెంకటస్వామి కొనియాడారు. దిశ దినపత్రిక నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ దినపత్రిక తెలుగు రాష్ట్రాల్లో వార్తలను వేగంగా చేరవేస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందిందన్నారు. అనతి కాలంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. దిశ దినపత్రిక ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుర మేనేజర్ నాగరాజు,రిపోర్టర్ రామకృష్ణ(ఆర్కే) తదితరులు పాల్గొన్నారు.


Similar News