రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో మైథం చెరువు తండా

Update: 2025-01-10 05:21 GMT

దిశ, కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో మైథం చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలోని సూర్యాపేట, జనగాం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై రాజు కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామస్తులైన పేరాల వెంకన్న(45) ,పేరాల జ్యోతి(35) ఈటురు నుంచి కడవెండి కి గ్రామానికి తుపాన్ లో వెళ్తుండగా, మంచు కారణంగా డీసీఎం వెనుక భాగంలో తుఫాన్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను జనగామ ప్రధాన ఆసుపత్రికి తరలించి నట్టు తెలిపారు.అందులో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని,మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.


Similar News