Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. విద్యార్థి అరెస్టు

ఢిల్లీలోని 23 స్కూళ్లకు(Delhi Schools) బాంబు బెదిరింపులు(bomb hoaxes) వచ్చిన ఘటనలో 12వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-01-10 06:16 GMT
Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. విద్యార్థి అరెస్టు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని 23 స్కూళ్లకు(Delhi Schools) బాంబు బెదిరింపులు(bomb hoaxes) వచ్చిన ఘటనలో 12వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో పరీక్ష జరగకూడదనే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. అయితే, కొన్ని వారాల క్రితం ఢిల్లీలోని స్కూళ్లకు వరుస బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ కేసుపై దర్యాపు చేపట్టారు. బాంబు బెదిరింపుల వెనకు విద్యార్థి పాత్ర ఉందని.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాంబు బెదిరింపులకు పాల్పడుతూ ఆరు సార్లు మెయిల్స్‌ పంపినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిసారి తాను చదివే స్కూల్ కి కాకుండా వేరే పాఠశాలలకు మెయిల్స్ పంపాడన్నారు. అనుమానం రాకుండా ఉండటానికి, ఎప్పుడూ మెయిల్ లో పలు స్కూళ్లను ట్యాగ్ చేశారని పేర్కొన్నారు.

ఎగ్జామ్స్ ని తప్పించుకునేందుకే..

అయితే, ఆ విద్యార్థి ఎగ్జామ్స్ తప్పించుకోవడానికే ఇలా చేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపులకు పాల్పడేలా ఒక ప్లాన్ రూపొందించాడని వెల్లడించారు. ఇలా చేస్తే, పరీక్షలకు అంతరాయం కలుగుతుందని.. వాటిని రద్దు చేస్తారని నిందితుడు భావించినట్లు పేర్కొన్నారు. ఇలా తరచుగా ఫేక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీసులు.. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి టీచర్లు, స్కూల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించారు. అలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై పోలీసులు, విద్యాశాఖ సెమినార్ ని కూడా నిర్వహించాయి.

Tags:    

Similar News