కొడుకులు పట్టించుకోవడంలేదని 80 ఏండ్ల వృద్ధురాలు నిరసన

కొడుకులు పట్టించుకోవడంలేదని వృద్ధురాలు నిరసనకు దిగిన సంఘటన మంగళవారం వర్ధన్నపేట మండలం ఇల్లన్న గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-12-03 15:48 GMT

దిశ, వర్థన్నపేట: కొడుకులు పట్టించుకోవడంలేదని వృద్ధురాలు నిరసనకు దిగిన సంఘటన మంగళవారం వర్ధన్నపేట మండలం ఇల్లన్న గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఇల్లంద గ్రామానికి చెందిన దోమకుంట. రాజమ్మ ( 80) అనే వృద్ధురాలు తమ కొడుకులు పట్టించుకోవడంలేదని తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయతీ ముందు బైఠాయించింది. తమకు ముగ్గురు కొడుకులు ఉన్నరని వారెవరు తమ బాగోగులు చూసుకోవడం లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై వృద్దురాలి గోడును విని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


Similar News