బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పై 6 సంవత్సరాల సస్పెన్షన్ వేటు

మహబూబాబాద్ జిల్లా బిజెపి పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ ను పార్టీ సభ్యత్వానికి 6 సంవత్సరాల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు యలమంచలి వెంకటేశ్వరరావు బయ్యారం పార్టీ సభ్యత్వం సమావేశంలో ప్రకటించారు.

Update: 2024-10-25 16:12 GMT

దిశ ,బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బిజెపి పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ ను పార్టీ సభ్యత్వానికి 6 సంవత్సరాల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు యలమంచలి వెంకటేశ్వరరావు బయ్యారం పార్టీ సభ్యత్వం సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చీకటి మహేష్ గౌడ్ ఈనెల 17 పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం రాష్ట్ర ,జిల్లా కోర్ కమిటిలో చర్చించి వారికి షోకాజ్ నోటీసులు పంపించడం జరిగిందని తెలిపారు. వారి నుండి ఎటువంటి సంజాయిషీ రాకపోవడంతో రాష్ట్ర నాయకులు పార్టీ నుంచి సస్పెండ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీ పార్టీలో ఉంటూ నాయకులు పార్టీ అనైతిక చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బిజెపి పార్టీ విలువలకు, విశ్వసనీయతకు మారు పేరని పార్టీలో పనిచేయడం అదృష్టంగా బావింఛాలని తెలిపారు.


Similar News