Waqf Board Amendment Bill: కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం!
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా సంస్థ సమచారం మేరకు.. శుక్రవారమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపారని టాక్. అయితే, త్వరలోనే పార్లమెంటులో అందుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ చట్టం (1954)లో 40కి పైగా సవరణలను తాజాాగా కేంద్ర ప్రభుత్వం చేర్చబోతున్నట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా మిలీటరీ, రైల్వే సంస్థల తరువాత మూడో అతి పెద్ద భూ యజమాని (సుమారు 9.4 లక్షల ఎకరాలు) వక్ఫ్ బోర్డే కావడం గమనార్హం.