తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో కనిపిస్తోంది: ఉండవల్లి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఏపీ కీలక నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-23 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఏపీ కీలక నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని అన్నారు. కానీ, ఏపీ అసెంబ్లీలో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలవడం వల్ల టీడీపీకి బలం పెరిగినట్లే అని అభిప్రాయపడ్డారు. త్యాగాలు చేయడానకి ఎవరూ రాజకీయాల్లోకి రారు చెప్పారు. సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని.. అలాంటి అనుభవం సీఎం జగన్‌కు ఉందని తాను అనుకోవడం లేదని అన్నారు.

Tags:    

Similar News