అప్పుచేసి కడుతున్నా ఏడవకండి రా బాబు.. దిష్టిబోమ్మ బదులు మీమ్స్
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్న సమయంలో కట్టే బిల్డింగ్ పై కొందరూ దిష్టిబోమ్మలు కడుతుంటారు. దానికి భిన్నంగా బిల్డింగ్‌కు ఓ మిమ్స్ ఫోటో పెట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్న సమయంలో కట్టే బిల్డింగ్ పై కొందరూ దిష్టిబోమ్మలు కడుతుంటారు. దీనికి భిన్నంగా బిల్డింగ్‌కు ఓ మిమ్స్ ఫోటో పెట్టారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అప్పు చేసి కడుతున్నాను చూసి ఏడవకండి రా బాబు..’అని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఉన్న ఫోటోతో బిల్డింగ్‌కు అందరూ చూసేవిధంగా కట్టిపెట్టారు. దీంతో బిల్డింగ్ ఓనర్ తెలివికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఒక మేమర్ ఇల్లు కట్టే క్రమంలో ఇలాంటి మీమ్స్ పెడుతారని, దిష్టి బొమ్మలు ఇలా కూడా పెడుతారా? అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య మీమ్స్‌ను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు బాగా చూస్తున్న విషయం తెలిసిందే. ఒక విషయాన్ని హాస్యస్పదంగా లేదా ఫోటోల రూపంలో సూటిగా.. తెలివిగా చెప్పడం. ఈ మీమ్స్ చేయడం కూడా ఒక కళ గా మారింది. కొందరు నెటిజన్లు వారి భావాలను మెసేజ్ రూపంలో కాకుండా మిమ్స్ రూపంలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.