Vikarabad: రేపటి నుంచి జిల్లా స్థాయిలో ప్రభుత్య ఉద్యోగుల పెన్ డౌన్

ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి(Attack On The Government Officials)కి నిరసనగా రేపటి నుంచి పెన్ డౌన్(Pen Down) చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు(Government Employees Union) తెలిపారు.

Update: 2024-11-11 13:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి(Attack On The Government Officials)కి నిరసనగా రేపటి నుంచి పెన్ డౌన్(Pen Down) చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు(Government Employees Union) తెలిపారు. వికారాబాద్ జిల్లా(Vikarabad District) కొడంగల్ నియోజవర్గం(Kodangal Constituency)లో ఫార్మాసిటీ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ సహా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై రైతులు దాడి చేశారు. ఈ దాడిని ఖండించిన జిల్లా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు.. దాడికి నిరసనగా పెన్ డౌన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా.. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం దారుణమైన చర్య అని మండిపడ్డారు. జిల్లా మేజిస్ట్రేట్(District Magistrate) స్థాయి అధికారిపైనే దాడి జరిగితే.. చిన్న ఆఫీసర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సమస్యలు ఉంటే అధికారుల వద్దకు వస్తారని, అధికారులకే ఇబ్బంది తలెత్తితే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసిన, కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిరసనగా రేపు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు హాజరవుతాము. కానీ పనులకు సెలవు ప్రకటిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా పెన్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు.

Tags:    

Similar News