Krishna vikarabad railway line : వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్.. రైల్వే అధికారులకు సీఎం సూచనలు

దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు.

Update: 2024-07-29 15:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎంని ఆయన కార్యాలయంలో కలిసి, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను ప్రెజెంట్ చేశారు.

వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' ప్రణాళికల్ని వడివడిగా పూర్తిచేసి, పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్నికా రెడ్డి, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News