అధ్యక్షుడిగా బండిని తొలగిస్తే.. బీజేపీలో ఉన్నవాళ్లు కూడా పోతారు: విజయరామారావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీలో త్వరలోనే పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయంటూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Update: 2023-07-01 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీలో త్వరలోనే పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయంటూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించి.. ఆ పోస్ట్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగిస్తారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మార్పు‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విజయరామారావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు ఆలోచన ఆత్మహత్య సదృశ్యమే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్‌ను మార్చితే బీజేపీలో చేరికలు కాదు.. పార్టీలో ఉన్న వాళ్లు కూడా బయటకు వెళ్లిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కంటే బలమైన మరో నేత తెలంగాణ బీజేపీలో లేరని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ల వరకు హైదరాబాద్ జంట నగరాలకే పరిమితమైన బీజేపీని.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక గ్రామగ్రామానికి తీసుకెళ్లిన ఘనత బండి సంజయ్‌దేనని అన్నారు. బీజేపీ హైకమాండ్‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఆలోచన ఉంటే.. అధిష్టానం మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. 


Similar News