Congress : ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పట్నం వ్యాఖ్యల వీడియో : కాంగ్రెస్
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఫార్మా కంపెనీ(Lagacharla Pharma Company) ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పైన, అధికారులపైన జరిగిన దాడికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) కుట్ర చేశారన్న ఆరోపణలను బలపరిచేలా కాంగ్రెస్ పార్టీ ఓ వీడియో బయట పెట్టింది.
దిశ, వెబ్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఫార్మా కంపెనీ(Lagacharla Pharma Company) ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పైన, అధికారులపైన జరిగిన దాడికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) కుట్ర చేశారన్న ఆరోపణలను బలపరిచేలా కాంగ్రెస్ పార్టీ ఓ వీడియో బయట పెట్టింది. పార్టీ ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేసింది. రైతుల భూములలో పార్మా కంపెనీ పెడితే తరిమికొడదామని పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. నాయకులు, అధికారులు, కలెక్టర్ ఎవరొచ్చిన తరిమికొడుదామని, రైతులకు నేను, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని రైతులతో చెప్పినట్లు ఉన్న వీడియో ఉంది.
కేటీఆర్ తో ఈ సమస్యపై చర్చించామని, ఈ సారి అవసరమైతే మనమే ఆందోళనలో పాల్గొందామని, మొన్న జరిగిన నిరసన కంటే రెట్టింపు నిరనసకు దిగి ఎవరొచ్చిన తరిమికొడుదామని నరేందర్ రెడ్డి రైతులతో చెప్పారు. ఇక్కడి రైతుల ఓట్లు వేసుకుని గెలిచిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు జరిగే నష్టంపై సోయి లేదా అని పట్నం విమర్శించారు. ఫార్మా కంపెనీ రద్దయ్యే వరకు మీ వెంట ఉండి పోరాడుతానని తెలిపారు. ఈ నేపథ్యం చూస్తే లగచర్లలో అధికారులపై దాడికి ముందునుంచే కుట్ర చేసినట్లుగా కనబడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. లగచర్ల దాడి కేసు దర్యాప్తులో కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా పట్నం వ్యాఖ్యలు ఉండటంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://x.com/Congress4TS/status/1856929521112621429