V. Hanumantha Rao:అందుకే కవిత బెయిల్ పై డౌట్.. టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రియాక్షన్

కవిత బెయిల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-28 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ దక్కడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు కవితకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఇన్నాళ్లు బెయిల్ నిరాకరించారు. ఇప్పుడు ఆమెకు బెయిల్ రావడంతోనే అందరికీ అనుమానం కలుగుతున్నదన్నారు. బుధవారం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. కవిత బెయిల్ పై సీబీఐ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందనే ప్రచారం జరుగుతున్నదన్నారు. చట్టం అందరికి సమానేమేనని తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చేకా తాను కామెంట్ చేస్తానన్నారు.


Similar News