BREAKING: కేసీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం సీఈవో వికాస్ రాజ్‌ను

Update: 2024-04-27 13:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన వీహెచ్‌పీ నేతలు కేసీఆర్‌పై కంప్లైంట్ చేశారు. దేవుడి పేరుతో అక్షంతలు ఆశచూపుతూ ఓట్లు వేయించుకుంటున్నారు అన్న కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన వీహెచ్‌పీ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియామవళికి విరుద్ధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేసీఆర్‌పై ఆంక్షలు విధించాలని వీహెచ్‌పీ నేతలు ఈసీని కోరారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉండగా గులాబీ బాస్‌‌పై వీహెచ్‌పీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

Read More...

ట్విట్టర్‌లో కేసీఆర్ ఫస్ట్ పోస్ట్.. వింటేజ్ లుక్ ఫొటో షేర్ చేసిన గులాబీ బాస్..! 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..