బ్రేకింగ్: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. పార్టీకి మాజీ MLA వేముల వీరేశం రాజీనామా

అభ్యర్థుల ప్రకటనతో అధికార బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. టికెట్ ఆశించి లిస్ట్‌లో పేరు లేని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-08-23 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థుల ప్రకటనతో అధికార బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. టికెట్ ఆశించి లిస్ట్‌లో పేరు లేని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో కొందరు పక్కదారులు చూస్తున్నారు.. మరికొందరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా మరో నేత బీఆర్ఎస్ నేత పార్టీకి రాజీనామా చేశారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రానున్న ఎన్నికల్లో నకిరేకల్ టికెట్ ఆశించిన వేముల వీరేశం.. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించిన వేముల.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను, తన అనుచరులను కేసులతో ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. మరో పది రోజుల్లో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు. కాగా, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వేముల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారని.. మరికొన్ని రోజుల్లో వేముల హస్తం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక, నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్‌ను సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వేముల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Tags:    

Similar News