రైతు బజార్‌లో కొట్టుకుపోతున్న కూరగాయలు.. ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

బంగాళఖాతంలో అల్పపీడం కారణంగా హైదరాబాద్ లో వానలు దంచికొడుతున్నాయి.

Update: 2024-09-01 07:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బంగాళఖాతంలో అల్పపీడం కారణంగా హైదరాబాద్ లో వానలు దంచికొడుతున్నాయి. వీధుల్లో భారీగా వరద నీరు చేరడంతో పలు కాలనీలు నీట మునిగాయి. నగరంలో రోడ్లపై వరద ఏరులై పారుతుండటంతో ట్రాఫిక్ జాం అయ్యి వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఓ రైతు బజార్ లో వరద నీటిలో కూరగాయలు కొట్టుకుపోతున్న వీడియో నెట్టింట చకర్లు కొడుతోంది. అయితే కూరగాయలు కొనేందుకు వచ్చిన జనం కొనడం మానేసి వరదలో కొట్టుకుపోతున్న వాటిని ఏరుకోవడం మొదలు పెట్టారు. గొడుగులు వేసుకొని మరి పారుతున్న వరదలో కూరగాయలు ఏరుకొని సంచుల్లో నింపుకున్నారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పలు రకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Similar News