Hydra Commissioner : హైడ్రా కమిషనర్ కు అమీన్ పూర్ బాదితుల ఫిర్యాదు

హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) బాధితుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-11-01 15:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) బాధితుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శుక్రవారం అమీన్ పూర్(Ameenpoor) కు చెందిన కొంతమంది రంగనాథ్ ను కలిశారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు అనే వ్యక్తులు తమను మోసం చేసి ప్రభుత్వ భూములు కట్టబెట్టరాని ఫిర్యాదు చేశారు. అమీన్ పూర్ పరిధిలోని సర్వే నం.6 అనుమతులు చూపించి సర్వే నం. 12కు చెందిన ప్రభుత్వ భూములను ఫ్లాట్లుగా చేసి తమకు అమ్మారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను మోసం చేసి ప్రభుత్వ భూములు అంటగట్టిన వారి నుంచి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కమిషనర్ వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే అమీన్‌పూర్ మండ‌లంలోని పెద్ద చెరువు అలుగులు మూసేసి.. ఎగువ వైపు త‌మ స్థ‌లాల్లోకి చెరువు నీరు వ‌చ్చేలాచేశారంటూ మ‌రికొంత‌మంది ఫిర్యాదు చేశారు. పెద్దచెరువు నీరు కింద ఉన్న బండికుంట చెరువుకు వెళ్లే లా కాకుండా.. అటువైపు అలుగులు మూసేయ‌డంతో ఎగువ‌వైపు నీరు పారుతుండ‌డంతో త‌మ ఇళ్ల స్థ‌లాలు కోల్పోయామంటూ పేర్కొన్నారు. స‌ర్వేనంబ‌రు 153లోని హుడా అనుమ‌తి పొందిన లే ఔట్లో ఉన్న పార్కు స్థ‌లాన్ని ప‌క్క‌నే కొత్త‌గా వెంచ‌ర్ వేస్తున్న వారు క‌బ్జా చేశారంటూ అమీన్‌పూర్ మండ‌లంలోని వెంక‌ట‌ర‌మ‌ణా కాల‌నీ వాసులు ఫిర్యాదు చేశారు. స‌ర్వే చేయించి త‌మ పార్కుతో పాటు.. లే ఔట్‌లోని ర‌హ‌దారుల‌ను కాపాడాలంటూ విన్నవించారు. ఈ విషయాలపై తగిన విచారణ జరిపించి, పూర్తి న్యాయం చేకూరుస్తానని రంగనాథ్ వారికి హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News