వెరైటీ పెళ్లి కార్డ్.. చూసి ఆశ్చర్యపోతున్న జనాలు ఎందుకో తెలుసా!
ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి తంతుని తమ జీవితాంతం గుర్తుండి పోవాలని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి తంతుని తమ జీవితాంతం గుర్తుండి పోవాలని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరూ వినూత్నంగా ఆలోచిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ప్రతి ఈవెంట్‌ను విచిత్రమైన రీతిలో నిర్వహించుకుంటున్నారు. తాజాగా, తెలంగాణకు చెందిన ఓ యువకుడు వెరైటీగా పెల్లి కార్డ్‌ను ముద్రించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా కడ్లూర్ గ్రామానికి చెందిన అనిల్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే అతను పెళ్లి అక్షర అనే అమ్మాయితో నిశ్చయమైంది. నవంబర్ 19న సిద్దిపేటలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. పెళ్లి కార్డును ప్రశ్నల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అలాగే కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ట్రూ, ఫాల్స్‌తో ఆన్సర్ తెలిపే విధంగా కార్డ్ ప్రింట్ చేయించాడు. అనిల్ మొత్తానికి తన పెళ్లి కార్డ్‌ను ఓ ప్రశ్నాపత్రంగా మార్చేశాడు. అంతేకాకుండా వందకు వంద మార్కులు కూడా ఉంటాయన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే టెక్నాలజీ పెరిగే కొద్ది ఇంకా ఎలాంటి కార్డులు వస్తాయో అని చర్చించుకుంటున్నారు.