అది నెహ్రూ కుటుంబం డీఎన్‌ఏలోనే ఉంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. డల్లాస్‌లో భారత సంతతికి చెందిన జర్నలిస్టుపై రాహుల్ టీమ్ దాడి చేసిందని అన్నారు. పత్రికల గొంతు నొక్కడం మొదటి నుంచి నెహ్రూ కుటుంబం డీఎన్‌ఏలోనే ఉందని కీలక ఆరోపణలు చేశారు. రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగినంత మాత్రాన కాంగ్రెస్‌ను జనం విశ్వసించబోరు అని అన్నారు.
అంతకుముందు తెలుగు రాష్ట్రాలకు కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ రైలు సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య నడుస్తుందని.. నాగ్‌పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుందని చెప్పారు.