రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నో యూజ్: కిషన్ రెడ్డి ఫైర్
అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం హన్మకొండలో పర్యటించిన కిషన్
దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం హన్మకొండలో పర్యటించిన కిషన్ రెడ్డి.. కేజీ-పీజీ యాజమాన్యాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తెలంగాణను సర్వనాశనం చేశాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని, హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములు అమ్మి నెలవారీ జీతాలు ఇచ్చే పరిస్థితి దాపరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదని, రూ.1200 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని ధ్వజమెత్తారు.