Union Budget : కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు

కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు చేశారు.

Update: 2024-07-23 07:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు చేశారు. రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 5 శాతం, రూ.7లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం స్లాబ్‌లు మార్చారు. రూ.12-15లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15లక్షల పైన 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త విధానంలో రూ.17,500 వరకు పన్ను ఆదా కానుంది. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్ లు మార్చిన కేంద్రం కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచింది. అయితే మధ్యతరగతికి మేలు చేకూర్చేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. టీడీఎస్‌ను సరళీకృతం చేస్తామన్నారు. ఈ కామర్స్‌పై టీడీఎస్ 0.1 శాతానికి తగ్గించారు. 

Tags:    

Similar News