అడ్డూ అదుపూలేని అక్రమ నిర్మాణాలు
శరవేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న ప్రాంతం మణికొండ. కాబట్టి ఇక్కడ భూములకు రెక్కలు వచ్చాయి.
దిశ, గండిపేట్: శరవేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న ప్రాంతం మణికొండ. కాబట్టి ఇక్కడ భూములకు రెక్కలు వచ్చాయి. ఈ మణికొండ మున్సిపాలిటీలో నాలాలు ప్రభుత్వ స్థలాలు మూసివేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఆక్రమణకు పాల్పడుతున్న వారిని రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వారిని ప్రోత్సహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, మణికొండ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 262లో వరదలు వస్తే ప్రవహించే బుల్కాపూర్ నాలా పక్కన బఫర్ జోన్ లో నిర్మాణాలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వీటిపై ప్రశ్నించే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నాలా ఆక్రమణపై రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఏపీ ఎమ్మెల్యే బ్రదర్ ఆగడాలు
మణికొండ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్నారు. ఇక్కడ జరిగే ఆగడాలను అదుపు చేయడంలో ప్రభుత్వం, కలెక్టర్ చేతులెత్తేసే పరిస్థితి ఉంది. కళ్ల ఎదుట కనిపించే నాలా.. నాలా పక్కన బఫర్ జోన్ విడవకుండా నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అమృత కన్ స్ట్రక్చన్ పెద్ద ఎత్తున నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నాలా పక్కన బఫర్ జోన్ విడిచిపెట్టి నిర్మాణాలు చేయకుండా నాలాను మూసివే సి నిర్మాణాలు చేపట్టడం వెనుక ఎవరి ప్రోత్సాహం అనేది ప్ర శ్నార్థకంగా మారింది. స్థానిక నాయకులు ప్రజా సంఘాల నాయకులు బఫర్ జోన్ లో నిర్మిస్తున్న నిర్మాణాలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. నోరు మూయించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే బ్రదర్ కావడంతో ప్రశ్నించే వారు కూడా భయపడుతున్నారు.
కన్ స్ట్రక్చన్ వ్యాపారులకు దాసోహమైన అధికారులు..?
అమృత కన్ స్ట్రక్చన్ మణికొండ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులోని బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ లోని నిర్మాణాల్లో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పాత్ర ఉన్నట్లు స్థానిక ప్రజలు ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ బఫర్ జోన్ నిర్మాణాల్లో అధికారులు చర్యలు తీసుకోపోవడంలో వెనుకడుగు వేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.