పిడుగు పడి ఇద్దరు దుర్మరణం

హన్మకొండ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగు పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు

Update: 2024-10-06 11:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : హన్మకొండ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగు పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వెంకటాపూర్ లో పొలంలో పిడుగు పడతంతో శ్రావణి (17), కూకట్ల రాజులు(25)లు దుర్మరణం చెందారు. హన్మకొండ సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. తెలంగాణలో మరో రెండురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసింది. సోమవారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. 


Similar News