TSPSC లీకేజీ కేసు విచారణ రేపటికి వాయిదా
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణను హై కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణను హై కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలను బోర్డు ఉద్యోగులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్‌లు లీక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఉన్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ క్రమంలో అసలేం జరిగిందన్నది తేల్చటానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అదనపు కమిషనర్ ( క్రైమ్స్) ఏ.ఆర్. శ్రీనివాస్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కేసును సీబీఐ దర్యాప్తు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిట్ విచారణ పారదర్శకంగా ఉంటుందన్న నమ్మకం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్ రాగా విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Also Read..
గ్రూప్-1 పేపర్ లీక్ చేసింది అతడే.. పోలీసుల విచారణలో బయటపడ్డ అసలు నిజం!