నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)లో నమోదైన నిరుద్యోగులందరూ వివరాలను ఎడిట్ చేసుకోవాలని
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)లో నమోదైన నిరుద్యోగులందరూ వివరాలను ఎడిట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. 15 రోజుల కిందట్నుంచే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఆన్‌లాక్ చేసిన కమిషన్.. వన్ టైం రిజిస్ట్రేషన్‌లో వివరాలను ఎడిట్‌కు అవకాశం కల్పించింది. కొత్త జిల్లాలు, జోన్లు ఏర్పాటు కావడంతో స్థానికతను తేల్చే విధంగా ఎడిట్ చేయాలని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ఓటీఆర్‌లో మొత్తం 25.18 లక్షల మంది నిరుద్యోగులు నమోదై ఉంటే.. ఇప్పటి వరకు 1.12 లక్షల మంది మాత్రమే ఎడిట్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం వెల్లడించింది. అభ్యర్థులందరికీ ఈ మెయిల్, ఫోన్లకు సమాచారం పంపించారు. ఓటీఆర్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారంతా కచ్చితంగా ఎడిట్ చేసుకోవాలని సూచించింది. దాని ప్రకారమే స్థానికతను తేల్చుతామని, ఓటీఆర్‌లో నమోదు కాకున్నా, గతంలో నమోదు చేసుకుని ఎడిట్ చేసుకోని వారందరినీ టీఎస్పీఎస్సీ వెలువరించే నోటిఫికేషన్లకు అనర్హులుగా గుర్తిస్తామని వెల్లడించింది. అంతేకాకుండా ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న వారు ఫోన్ నెంబర్లు మార్చితే వాటిని ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పాత మొబైల్ స్థానంలో కొత్త మొబైల్ నెంబర్‌ను ఎడిట్ చేయాలని వెబ్సైట్లో కాలమ్ రూపొందించింది.