బ్రేకింగ్: నిరుద్యోగులకు షాక్.. మరో రెండు పరీక్షలను రద్దు చేసిన TSPSC

టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే ఏఈ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ తాజాగా మరో రెండు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2023-03-17 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే ఏఈ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ తాజాగా మరో రెండు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణ జూనియర్ లెక్చరర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన పరీక్షలకు త్వరలోనే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించింది. రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11వ తేదీన తిరిగి మరోసారి నిర్వహిస్తామని ప్రకటించింది. 

 

Tags:    

Similar News