TS EMCET : విద్యార్థులకు బిగ్ అలర్ట్
ఇక నుంచి ఎంసెట్‌కు అప్లై చేసుకునే అభ్యర్థలు హైదరాబాద్ లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇక నుంచి ఎంసెట్‌కు అప్లై చేసుకునే అభ్యర్థలు హైదరాబాద్ లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్ తెలిపారు. మిగిలిన చోట్ల పరీక్షా కేంద్రాల సామర్థ్యం నిండిపోయిందన్నారు. హైదరాబాద్‌లోనూ జోన్-1, 2లలో మాత్రమే ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు చేసినా.. అభ్యర్థులు హైదరాబాద్ వచ్చే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు సోమవారంతో ముగియగా ఇప్పటివరకు ఇంజినీరింగ్‌కు 1.94 లక్షలు, అగ్రికల్చర్‌కు 1.10 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్స్ భారీగా పెరిగాయన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు రూ.250 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.