TS Assembly : CM రేవంత్‌కు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సంచలన సవాల్ విసిరారు.

Update: 2024-07-24 14:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సంచలన సవాల్ విసిరారు. ఒక్క రోజు కేంద్రం రాష్ట్రానికి సహకారం నిలిపేస్తే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దమ్ముందా అని ప్రశ్నించారు. నిధులు కేంద్రానివి, ప్రచారం రాష్ట్రానిది అన్నారు. బడ్జెట్‌కు వ్యతిరేకంగా తీర్మానం పెట్టడం బాధాకరం అన్నారు. అసెంబ్లీలో కేంద్రంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పారన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌లో కేటాయింపులపై వాడీవేడి చర్చ జరగగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 27న ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. తెలంగాణ హక్కులకు కేంద్రం భంగం కలిగించిందన్నారు. అంతకుముందు ‘కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయం’ తీర్మానాన్ని వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి.

Tags:    

Similar News