కేసీఆర్‌కు మళ్లీ టీఆర్ఎస్ఆలోచన
కేసీఆర్‌కు మళ్లీ టీఆర్ఎస్ ఆలోచన వచ్చిందని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు..
- దేశ రాజకీయాలపై తగ్గిన ఆసక్తి
- రాష్ట్రంలో ఉనికి కోసం ఆరాటం
- కర్ణాటక ఫలితాలతో ఉలిక్కిపడ్డ సీఎం
- - టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ చామల కిరణ్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌కు మళ్లీ టీఆర్ఎస్ఆలోచన వచ్చిందని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తాను రాణించలేనని గ్రహించిన కేసీఆర్,తన రూట్మార్చుకున్నాడని విమర్శించారు.బీఆర్ఎస్వేసిన స్కెచ్వేసిన ఫెయిలైందన్నారు. అందుకు రాష్ట్రంలో ఉనికి కోసం ఆరాటపడుతున్నారన్నారు. కర్ణాటక ఫలితాలను చూసిన కేసీఆర్, దేశ వ్యాప్తంగా గెలవడం కష్టమనే నిర్ణయానికి వచ్చాడన్నారు. దేశం అంటూ తిరిగితే రాష్ట్రంలో స్థానాన్ని కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించిన కేసీఆర్..టీఆర్ఎస్ పేరును తెరమీదకు తీసుకువచ్చాడన్నారు.
ఇంటిలిజెన్స్సర్వేలు కూడా ఇవే సూచించాయని, అందుకే కేసీఆర్ డైలమాలో పడ్డాడని చామల కిరణ్ కుమార్సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. 80 నుంచి 100 సీట్లలో గెలుస్తామనే నమ్మకం ఉన్నదన్నారు. నిరుద్యోగులు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఇది కేసీఆర్ ఓటమికి నాంది పలుకుతాయన్నారు.