‘బ్రిటన్ఎంపీలను మోసగించిన బీఆర్ఎస్.. అంబేద్కర్పేరుతో అసత్య ప్రచారం’
బ్రిటన్పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ పేరుతో చేసిన కార్యక్రమంలో బ్రిటన్ఎంపీలు తమకు మద్దతుగా పాల్గొన్నట్లు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని టీపీసీసీ ఎన్నారై సెల్గంపా వేణుగోపాల్ స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బ్రిటన్పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ పేరుతో చేసిన కార్యక్రమంలో బ్రిటన్ఎంపీలు తమకు మద్దతుగా పాల్గొన్నట్లు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని టీపీసీసీ ఎన్నారై సెల్గంపా వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్ఎస్ చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నదన్నారు. బ్రిటన్ పార్లమెంట్‌లో తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో కార్యక్రమం నిర్వహించి ముగ్గురు బ్రిటన్ ఎంపీలు నవీందు మిశ్రా, కుల్దీప్సింగ్ సహోట, వీవీరేంద్ర శర్మలను ఆహ్వానించారని అయితే, వాళ్లు స్వచ్చందంగా తమకు మద్దతు ఇచ్చేందుకు హాజరైనట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సహజంగా అంబేద్కర్పేరుతో చేసే కార్యక్రమాలకు ప్రజప్రతినిధులు గౌరవంగా హాజరు అవుతారన్నారు.
కానీ, తెలుగు ప్రజలను మోసం చేసేలా బీఆర్ఎస్చేస్తున్న తప్పుడు ప్రచారంపై సదరు ఎంపీలకు ఫిర్యాదు చేశామన్నారు. వాస్తవానికి తాము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పినా.. ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. కనీసం రెండోసారి పవర్‌లోకి వచ్చినప్పుడు కూడా దళితులకు అవకాశం ఇవ్వలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు. అందరికీ దళితబంధు కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కేసీఆర్ చేస్తున్న మోసాలను గమనించాలన్నారు.