తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ స్కామ్: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఓఆర్ఆర్ లీజ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ లీజ్‌లో భారీ స్కామ్ జరిగిందని.. ఈ స్కామ్‌లో దాదాపు రూ.1000 కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. ఓఆర్ఆర్ లీజ్ స్కామ్‌లో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రలు కీలకమని.. వారిద్దరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ స్కామ్‌పై విచారణ సంస్థకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు.
విదేశీ పెట్టుబడులకు కీలకంగా మారిన ఓఆర్ఆర్‌కు ప్రతి ఏటా 700 నుండి 800 కోట్లు టోల్ రూపంలో వస్తాయని.. కానీ 30 ఏళ్ల కాలానికి ఓఆర్ఆర్‌ను రూ.7,380 కోట్లకే అమ్మేశారని ఆరోపించారు. ఇంత పెద్ద కుంభకోణంపై కాంగ్రెస్ సహిందేది లేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక, హైదరాబాద్‌కే తలమానికమైన ఓఆర్ఆర్‌ను హెచ్ఎమ్‌డీఏ 30 ఏళ్ల కాలానికి రూ.7,380 కోట్లకు ముంబైకి చెందిన ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థకు లీజ్‌కు ఇచ్చింది.