లక్షల కోట్లు వెనకేసుకునేలా ప్రభుత్వం కుట్ర: రేవంత్ రెడ్డి
రాష్ట్ర కేబినెట్ 111 జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాధనం కొల్లగొట్టేందుకే 111 జీవోను ప్రభుత్వం రద్దు చేయడానికి పూనుకున్నదని అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర కేబినెట్ 111 జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాధనం కొల్లగొట్టేందుకే 111 జీవోను ప్రభుత్వం రద్దు చేయడానికి పూనుకున్నదని అన్నారు. జంట నగరాల్లో విధ్వంసం జరుగుతోందని, 111 జీవో హిరోషిమాపై అణుబాంబు లాంటిదని తెలిపారు. జీవోను రద్దు చేసి లక్షల కోట్లు వెనకేసుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి పాలనలో కూడా ప్రజలకు ఇన్ని సమస్యలు లేవని, రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ జీవన విధానాలను ఛిద్రం చేస్తున్నడాని మండిపడ్డారు.
కేసీఆర్‌కు రైతుల గోడు పట్టదని అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక సమస్యలను గాలికొదిలి.. రియల్ ఏస్టేట్ వ్యాపారుల కోసం 111 జీవోను రద్దు చేశారని అన్నారు. ప్రభుత్వం భూ కబ్జాదారుల చేతుల్లో బందీ అయ్యిందని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతల మెప్పు కోసమే 111 జీవో ఎత్తేశారని విమర్శించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు పాలకుల ధన దాహానికి బలి కాబోతున్నాయన్నారు.
Also Read..
వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు: రేవంత్ రెడ్డి