బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పర్యటించారు.

Update: 2024-10-05 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పర్యటించారు. డిచ్‌పల్లి సీఎస్‌ఐ ఆసుపత్రిలో డాక్టర్స్ క్వార్టర్స్ ప్రారంభించారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సీఎస్‌ఐ ఆధ్వర్యంలో త్వరలోనే నర్సింగ్ కళాశాల ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి డిచ్‌పల్లిలో మెడికల్ కాలేజీని పున:ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. అంతేకాదు.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ(Bodhan Sugar Factory)ని కూడా పునరుద్ధరిస్తామని అన్నారు.

కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు బీఆర్ఎస్ హయాంలో ఎంత రుణమాఫీ జరిగిందో హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నాల పేరిట హరీష్ రావు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా రాబోయే సంస్థాగత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దూకుడు పెంచారు. ఇందులో భాగంగా డీసీసీ, మండల, గ్రామస్థాయి నుండి పార్టీని స్ట్రేంతెన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక ఓటు బ్యాంకు హస్తం వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. తన సొంత జిల్లా నుండి పర్యటన షురూ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నాటికి పర్యటన పూర్తి చేయాలని భావిస్తున్నారు.


Similar News