Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. తరలివస్తున్న పర్యాటకులు..!

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. ఈక్రమంలో నాగార్జున సాగ‌ర్(Nagarjunasagar) 24 గేట్లు ఎత్తి 2.99 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

Update: 2024-09-08 04:51 GMT

దిశ,వెబ్‌డెస్క్:నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. ఈక్రమంలో నాగార్జున సాగ‌ర్(Nagarjunasagar) 24 గేట్లు ఎత్తి 2.99 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 588 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ప్ర‌స్తుత నిల్వ సామ‌ర్థ్యం 308 టీఎంసీలు కాగా, పూర్తి నిల్వ సామ‌ర్థ్యం 312 TMCలు. సాగ‌ర్ గేట్లు ఎత్త‌డంతో ప‌ర్యాట‌కులు(Tourists) త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు కావ‌డంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి ప‌ర్యాట‌కుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వ‌ద్ద ఎలాంటి ప్ర‌మాద ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.


Similar News