టెన్త్‌లో టాపర్.. ఇంటర్‌లో అన్ని సబ్బెక్టులు కలిపి 13 మార్కులే!
నిర్మల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో షాకింగ్ మార్క్స్ స్కోర్ చేశాడు.
దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో షాకింగ్ మార్క్స్ స్కోర్ చేశాడు. పదో తరగతిలో ఉత్తమ మార్కులతో పాసైన ఆ విద్యార్థి ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ గ్రూపులో చేరాడు. అయితే మొదటి సంవత్సరం పూర్తి చేసిన ఆ విద్యార్థి ఈ ఏడాది ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి పరీక్షలు వ్రాశాడు. మొత్తం 470 మార్కులకు గాను అన్ని సబ్జెక్టులలో కలిపి కేవలం 13 మార్కులు స్కోర్ చేశాడు. ఈ మార్కులు చూసిన కళాశాల యాజమాన్యం దిమ్మతిరిగిపోయింది.
మొత్తం 13 మార్కులే రావడం చూసి కళాశాల లెక్చరర్లు అవాక్కయ్యారు. ఆ విద్యార్థి మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా మళ్లీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధిస్తానని చెప్పడం గమనార్హం. తెలుగులో 2, ఇంగ్లీషులో 8, మ్యాథ్స్ A లో 1, ఫిజిక్స్‌లో 2 రాగా... మ్యాథ్స్ B, కెమిస్ట్రీ లో సున్నా చొప్పున మార్కులు వచ్చాయి. పరీక్షలకు హాజరు కాని విద్యార్థులను ఎందరినో చూశాం కానీ పరీక్షలు రాసి కేవలం 13 మార్కులు మాత్రమే తెచ్చుకున్న విద్యార్థిని తొలిసారిగా చూస్తున్నామని కళాశాల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఈ విద్యార్థి షాకింగ్ మార్క్స్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.