ఇవాళే కాంగ్రెస్ పెండింగ్ అభ్యర్థుల ప్రకటన!.. ఆ ఒక్క స్థానంలో ఖరారు కాని అభ్యర్థి?

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ ముగిసింది.

Update: 2024-04-01 07:45 GMT

 దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సహా పార్టీ అగ్రనేతలు ఈ మీటింగ్ లో పాల్గొని ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అభ్యర్థిలు ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఒక్కోనేత నుంచి అభ్యర్థులపై అభిప్రాయాల సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు సూచించిన అభ్యర్థి గెలుపు ఓటములపై విశ్లేషణ అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ పెండింగ్ లో ఉన్న వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేయగా ఖమ్మం స్థానానికి అభ్యర్థి ఖరారు ఇంకా పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవ్వాళ రాష్ట్రానికి చెందిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ నెల 9న మరోసారి సీఈసీ భేటీ జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ఖమ్మం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కీలక నేతలు పోటీ పడుతున్నందునా ఆ స్థానానికి అభ్యర్థి విషయంలో పీటముడి వీడటం లేదనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News