Rajasingh: క్రాక్‌డౌన్ నుండి దృష్టి మరల్చడానికే విగ్రహాల ధ్వంసం

పాతబస్తీలో దేవాలయంలోని భూలక్ష్మి, నల్ల పోచమ్మ విగ్రహాల ధ్వంసంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

Update: 2024-08-27 09:56 GMT

దిశ. డైనమిక్ బ్యూరో: పాతబస్తీలో దేవాలయంలోని భూలక్ష్మి, నల్ల పోచమ్మ విగ్రహాల ధ్వంసంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఘటనపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గత రాత్రి హైదరాబాద్ పాతబస్తీలోని రాక్షాపురం ప్రాంతంలో మానసిక స్థితి సరిగా లేదని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఆలయంపై రాళ్లు రువ్వి భూలక్ష్మి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని తెలిపారు. మానసికంగా అస్థిరంగా చెప్పుకునే ఈ వ్యక్తి ఇతర మత స్థలాలపై దాడి చేయలేదని, కేవలం హిందూ దేవాలయాలు, విగ్రహాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని ఎందుకు కూల్చివేశాడనే ప్రశ్నలను లేవనెత్తుతుందని అన్నారు.

అక్రమ ఆక్రమణలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన దారి మళ్లింపు వ్యూహంగా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కథనాన్ని మార్చడానికి, హైడ్రా ద్వారా కొనసాగుతున్న క్రాక్‌డౌన్ నుండి దృష్టి మరల్చడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తున్నానని రాజాసింగ్ అన్నారు. సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రక్షాపురం ప్రధాన రహదారిలో ఉన్న చారిత్రాత్మక భూలక్ష్మమ్మ దేవాలయంలో భూలక్ష్మమ్మ, నల్ల పోచమ్మ విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై బీజేపీ నాయకులు సహా హిందూ సంఘాలు నిరసన దీక్షకు దిగాయి. పోలీసులు వారికి నత్సజెప్పి నిరసనను విరమింపజేశారు.


Similar News