Teenmaar Mallanna: మండలిలో మొదటి స్పీచ్ లో అదరగొట్టిన తీన్మార్ మల్లన్న.. నిరుద్యోగుల సమస్యపై విజ్ఞప్తి

మొదటి స్పీచ్ లోనే తీన్మార్ మల్లన్న అదరగొట్టారు.

Update: 2024-07-24 11:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ హోదాలో తీన్మార్ మల్లన్న బుధవారం తొలిసారి మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఆయన లెవెత్తారు. గ్రూప్ -1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని అయితే ఈ రేషియోలో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. టాప్ ర్యాకర్లను జనరల్ కేటగిరిలో కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలోకే తీసుకుంటున్నారని దీని ద్వారా ఎక్కువ మంది అణగారిన వారికి, మహిళలకు అన్యాయం జరుగుతున్నదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దయచేసి యూపీఎస్సీ తరహాలో ఉండేలా ఎంపిక చేస్తే ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లారు.

అలాగే గందమళ్ల రిజర్వాయర్ అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఈ రియర్వాయర్ పనులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నాయని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఇది తన సొంత మండలంలోని ప్రతిపాదిత రిజర్వాయర్ అని అన్నారు. ఇది ఆలేరు నియోజకవర్గానికి ఏకైక పెద్ద సోర్స్ గా ఈ రిజర్వాయర్ అని గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని సరిదిద్ధుతూ.. ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా పూర్తి చేసేందుకు గందమళ్ల రిజర్వాయర్ కు ఇంకా ఏదైనా నిధుల కేటాయింపులు ఉండే ఈ బడ్జెట్ లో కేటాయించాలని కోరారు. ఈ ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి ఉత్తమ్ గందమళ్ల ప్రాజెక్టుపై గత ప్రభుత్వం ఒక్కరూపాయి ఇవ్వలేదని భూమి సేకరణకు స్థానిక ప్రజలు సహకరిస్తే తప్పకుండా ప్రభుత్వం వెంటనే పనులు మొదలుపెడుతుందన్నారు.

రైతు భరోసా విషయంలో గతంలో జరిగిన తప్పిదాలకు రిపీట్ కాకుండా చూడాలని కోరారు. గతంలో పెట్రోల్ బంకులు, వెంచర్లు, ఇళ్లు నిర్మించుకున్న స్థలాలతో పాటు అనర్హులకు రైతు భరోసా రాకుండా అన్ని అంశాలను పరిశీలించాకే అసలైన రైతులకు దక్కేలా చూడాలన్నారు.


Tags:    

Similar News